
వెల్లివిరిసిన సేవాభావం
పులివెందులలో పారిశుధ్య కార్మికులకు
దుస్తులు పంపిణీ చేస్తున్న వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు
కడప జెడ్పీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానాలు, పేదలకు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కడపలో జరిగిన వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. – కడప కార్పొరేషన్/ పులివెందుల

వెల్లివిరిసిన సేవాభావం