
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
కమలాపురం : కమలాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన మునీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు.. మునీంద్ర క్రాస్ రోడ్డు నుంచి కమలాపురం పట్టణంలోకి బైక్‌పై వస్తుండగా ఆర్చి వద్ద వేగ నిరోధక హెచ్చరిక బోర్డును ఢీ కొన్నాడు. ఈ ఘటనలో తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉత్సాహంగా క్రీడల పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : 2025 జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం క్రీడల పోటీలు ఉత్సాహంగా సాగాయి. నగరంలోని క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ, వెయిట్ లిప్టింగ్ పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు, డీఎస్‌ఎ క్రీడా మైదానంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించగా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ప్రతిభ చూపిన వారిని జట్టుగా ఏర్పాటుచేస్తామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 11న తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు