కమ్ముకొస్తున్న కరువు మేఘం | - | Sakshi
Sakshi News home page

కమ్ముకొస్తున్న కరువు మేఘం

Aug 9 2025 5:10 AM | Updated on Aug 9 2025 5:10 AM

కమ్ము

కమ్ముకొస్తున్న కరువు మేఘం

ఖరీప్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటికీ సరైన వర్షం కురవకపోవడంఓత అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ కరువు మేఘం కమ్ముకొస్తోంది. ఎటు చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. కేసీ కెనాల్‌ కింద మినహా చాలా ప్రాంతాల్లో అధిక శాతం బీడుగా దర్శనమిస్తున్నాయి. గతేడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టాలను చవిచూసిన జిల్లా రైతులు తాజాగా వరుణుడి కరుణలేక నష్టపోతున్నారు.

కడప అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా 77475 హెక్టార్ల సాధారణ సాగుకుగానూ 14,467 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇది కేవలం 18.67 శాతం మేర మాత్రమే. మరో 50 రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరవు పరిస్థితి తప్పదని అన్నదాతలు అందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు కొంతమేర ఆశలు చిగురించినా ఏ మాత్రం పంటల సాగుపై ప్రభావం చూపడంలేదు. గత ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలు కురియడంతో రైతులు అశలు పెట్టుకున్నారు. జూన్‌లో ఖరీఫ్‌ మొదలయ్యే నాటికి వరుణుడు ముఖం చాటేయడం, జులైలోనూ సాధారణ వర్షపాతం 96.7 శాతం కాగా.. కేవలం 59.7 శాతం కురవడంతో ఆశలు నీరుగారిపోయాయి. ఆగస్టులో ఇప్పటి వరకూ 22.9మేర వర్షం కురిసింది.

18.67 శాతం భూముల్లోనే పంటల సాగు

జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కేవలం 18.67 శాతం మేర వివిధ పంటలు సాగయ్యాయి. ఇంకా 80 శాతం భూములు బీడుగానే కనిపిస్తున్నాయి. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 77474 హెక్టార్లు ఉంది. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 14467.58 శాతం మేర పంటలు సాగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్థమవుతోంది. అడపాదడపా నీటివసతి లేని ఆరుతడి పంటలు ఎండుతున్నాయి. కేసీ కెనాల్‌ పరీవాహన ప్రాంతంలో 30,804 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 6098 హెక్టార్లలో వరిపంట సాగైది. జొన్న 29 హెక్టార్లు, సజ్జ 689 హెక్టార్లు, మొక్కజొన్న 1728 హెక్టార్లు, కొర్ర 11.6 హెక్టార్లలో సాగు చేశారు. ఇక వేరుశనగ 926, పత్తి 3185, మినుము 1388 హెక్టార్లలోనూ సాగు చేశారు. కంది విస్తీర్ణం బాగా తగ్గిపోయి 112 హెక్టార్లకే పరిమితమైంది. సోయాబీన్‌ 45 హెక్టార్లలో సాగైంది. ఇంకా వర్షాలు కురవకపోవడంతో తాము పంటలు వేసే పరిస్థితి లేదని.. ఈ ఏడాది కరవు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల సాధారణ నమోదైన

వర్షపాతం వర్షపాతం

(మి.మీలలో) (మి.మీలలో)

జూన్‌ 68.2 21.6

జులై 96.7 59.7

ఆగస్టు 118.8 22.9(ఇప్పటికి)

ఖరీప్‌ ప్రారంభమైనా

14,467 హెక్టార్లలోనే పంటల సాగు

కేసీ కెనాల్‌ కింద కాసింత సాగు ముమ్మరం

కమ్ముకొస్తున్న కరువు మేఘం 1
1/1

కమ్ముకొస్తున్న కరువు మేఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement