● గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో..
ప్రభుత్వ చౌకదుకాణం వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటికి రేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ వాహనాలను) సమకూర్చి సరుకులను ప్రజలకు అందిస్తూ వచ్చారు. బియ్యం బండి ఫలాన గ్రామం, వీధికి ఎప్పుడు వస్తుందో ముందుగానే వలంటీర్లు సమాచారం అందించేవారు. దీంతో రేషన్ కార్డుదారులు బియ్యం బండి వచ్చే సమయానికి అందుబాటులో ఉండి.. సరుకులు ఇంటి ముంగిటే తీసుకునేవారు. అందువల్ల ఎవరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. ఈ విధానం ఇతర రాష్ట్రాల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రజలు కూడా ఈ విధానానికి కొన్నేళ్లుగా అలవాటు పడ్డారు. ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచి పనులను చెరిపి వేయాలన్న ఉద్దేశంతో.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. మళ్లీ ప్రభుత్వ చౌక దుకాణాల నుంచి రేషన్ పొందాల్సి రావడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.


