మట్టి తవ్వకాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డమాయపల్లె ప్రాంతంలో బుధవారం మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. గడ్డమాయపల్లె సమీపంలో సర్వే నంబర్ 83లోని ప్రభుత్వ భూముల్లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ అనుమతి లేకున్నా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామానికి చెందిన తప్పెట శశిధర్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. అనుమతి లేనట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.


