చెక్‌డ్యామ్‌ల చుట్టూ తోడేస్తుండ్రు! | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యామ్‌ల చుట్టూ తోడేస్తుండ్రు!

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

మోటకొండూరు పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల వద్ద అక్రమ తవ్వకాలు

మోటకొండూరులో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇసుక

మోటకొండూర్‌: మోటకొండూర్‌ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఇప్పటికే ఆరుగురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినా, అక్రమార్కుల్లో ఏమాత్రం భయం కలగడం లేదు. అమ్మనబోలు, ఇక్కుర్తి, దిలావర్‌పూర్‌, కాటేపల్లి, చాడ, కొండాపూర్‌, మాటూర్‌, తేర్యాల తదితర గ్రామాల వాగుల నుంచి రాత్రి వేళల్లో, సెల వు రోజుల్లో దొంగచాటుగా ఇసుకను తోడేస్తున్నారు.

నీటితో ఫిల్టర్‌ చేసి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో కొందరు ఒక ట్రిప్‌ కు పర్మిషన్‌ పొంది, పదుల సంఖ్యలో ట్రాక్టర్లద్వారా ఇసుక దందా సాగిస్తున్నారు. మోటకొండూర్‌ వాగులో ఇసుక లేకపోవడంతో గడ్డలను నీటితో ఫిల్టర్‌ చేసి మరీ విక్రయిస్తున్నారు. అధికారులు అడపాదడపా తక్కువ మొత్తంలో జరిమానాలు విధించి విడిచిపెడుతుండటంతో అక్రమార్కులకు సహకరిస్తున్నట్లవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బిక్కేరు, ఆలేరు పెద్దవాగులో భూగర్భజలాలను పెంచడం కోసం నిర్మించిన చెక్‌ డ్యామ్‌ల చుట్టూ ఉన్న ఇసుకను సైతం తోడేయడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. వర్షాభావ పరిస్థితులకు తోడు ఈ అక్రమ తవ్వకాల వల్ల బావులు, బోర్లు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీంతో పంటలకు నీరందక తీవ్ర ఎద్దడి తలెత్తుతుందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ బైండోవర్‌ కేసులు పెట్టినా ఆగని ఇసుక అక్రమ రవాణా

ఫ అడుగంటిన భూగర్భ జలాలు

ఫ ఆందోళనలో మోటకొండూర్‌ మండల రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement