అర్హులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం రెండు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసింది.
మండల స్థాయి కమిటీ : ఎంపీడీఓ (గ్రామీణ ప్రాంతాల్లో), మున్సిపల్ కమిషనర్ (పట్టణాల్లో) ఆధ్వర్యంలోని కమిటీ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి, ఆదాయ–కుల ధ్రువపత్రాలను సరిచూ సి ప్రాథమిక అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది.
జిల్లా స్థాయి కమిటీ: కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీ.. మండలాల నుంచి వచ్చిన నివేదికలను సమగ్రంగా పరిశీలించి తుది లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తెలుపుతుంది.
భువనగిరిటౌన్: వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆటోమేటిక్ కుట్టు యంత్రాల పంపిణీ పథకానికి జిల్లాలో విశేష స్పందన లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరించగా 15,583 మంది మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
2 వేల యూనిట్లే లక్ష్యం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఆటోమేటిక్ కుట్టు మిషన్లను కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలోని భువనగిరి, ఆలేరు రెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 2,000 మిషన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కానీ ఎనిమిది రెట్లకు పైగా దరఖాస్తులు రావడంతో, అర్హులను ఎంపిక చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
మండలాల వారీ కోటాపై రాని స్పష్టత
నియోజకవర్గాల వారీగా లక్ష్యం ఖరారైనప్పటికీ, మండలాలు, మున్సిపాలిటీల వారీగా కేటాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు తుంగతుర్తి నియోజకవర్గంలోకి, రామన్నపేట మండలం నకిరేకల్ పరిధిలోకి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలు మునుగోడు పరిధిలోకి వస్తాయి. ఆలేరు నియోజకవర్గ పరిధిలో 8 మండలాలు, 2 మున్సిపాలిటీలు విస్తరించి ఉన్నాయి. భువనగిరిలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాలు, సరిహద్దు మండలాల విభజన, అధికారిక కోటా ఉత్తర్వులు అందిన తర్వాతే మండలాల వారీ కేటాయింపులు కొలిక్కి రానున్నాయి.
ఫ యూనిట్లు 2వేలు.. వచ్చిన దరఖాస్తులు 15,583
ఫ ఎనిమిది రెట్లు పెరిగిన పోటీ


