వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

భువనగిరిటౌన్‌ : వృద్ధులను గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వృద్ధులతో కలిసి అధికారులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. వృద్ధుల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారికి ప్రేమ, ఆప్యాయతలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీడబ్ల్యూఓ ఇన్‌చార్జ్‌ అధికారి శ్రీనివాస్‌, జేఏసీ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి, డీఎంహెచ్‌ఓ తదితరలుఉ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement