హోరాహోరి పోరు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరి పోరు

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రచారం స్థానిక సంస్థల పోరును తలపిస్తూ ఊపందుకుంది. ఈ నెల 9వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. ప్రధాన యూనియన్ల నాయకులు ప్రచారంలో హోరాహోరీగా దూసుకుపోతున్నారు. అయితే, పోటీలో ఉన్న వివిధ యూనియన్లు ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీల్లో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఫొటోలను వాడుకోవడం ఇప్పుడు డిపోలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కూటమిగా ఏర్పడి..

కాంగ్రెస్‌ మిత్రపక్షాలైన సీపీఐ, ఏఐటీయూసీలకు అనుబంధంగా ఉన్న ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), టీఎంయూ, ఎన్‌ఎంయూ ఒక కూటమిగా, ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా ఉన్న టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు మరో కూటమిగా బరిలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీఎంఎస్‌ (కార్మిక్‌ సంఘ్‌), టీజేఎంయూ ఒంటరిగా బరిలో నిలిచి ప్రచారం కొనసాగిస్తున్నాయి.

చర్చనీయాంశంగా ఫ్లెక్సీలు..

డిపో వద్ద ఆయా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమితో పాటు.. టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ల ఐక్య కూటమి సైతం ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఫొటోను తమ ఫ్లెక్సీలపై ముద్రించుకున్నాయి. పైగా ఐక్య కూటమి నాయకులు ఇటీవల బీర్ల ఐలయ్యను టీడబ్ల్యూఎఫ్‌ డిపో గౌరవ అధ్యక్షుడిగా నియమించుకున్నారు. మరోవైపు ఒంటరిగా పోటీ చేస్తున్న తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) ఫ్లెక్సీలోనూ ఆయన ఫొటో దర్శనమిస్తోంది. ఇలా అన్ని యూనియన్లు ఆయన ఫొటోను వాడుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఫ తొమ్మిదేళ్ల తర్వాత ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు

ఫ యూనియన్ల నేతల విస్తృత ప్రచారం

ఫ ఈ నెల 9వ తేదీన పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement