జ్ఞానేష్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేష్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలి

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

సాక్షి, యాదాద్రి: సమగ్ర ఓటర్ల సర్వే (ఎస్‌ఐఆర్‌) పేరిట దేశవ్యాప్తంగా ఓట్లను అక్రమంగా తొలగిస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘సేవ్‌ డెమోక్రసీ వీక్‌’లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమాక్రసీ పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జ్ఞానేష్‌ కుమార్‌ ఫ్లెక్సీని దహనం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ అదనపు కలెక్టర్‌ వెంకా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఐలయ్య మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేయాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ఓటు హక్కుకే ముప్పు వాటిల్లుతుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీపీఎం నేత చెరుపల్లి సీతారాములు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌ రెడ్డి, సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకుడు మామిడాల భిక్షపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీసేలా సాగుతున్న ఓట్ల తొలగింపు విషయంలో భారత రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మహాధర్నాలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ మాజీ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గోద శ్రీరాములు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, భువనగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ కుమార్‌, నీలం పద్మ వెంకటస్వామి, గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య డిమాండ్‌

ఫ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌, వామపక్షాల మహాధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement