భువనగిరి : మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైనట్లు అతడి కుమారుడు బుధవారం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరేపల్లికి చెందిన కాసుల బాలరాజు సోమవారం ఉదయం జీడిమెట్లకు వెళ్తున్నానని తన కుమారుడు సురేష్‌కు చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. సాయంత్రం అయినా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం ఇవ్వకపోవడంతో బంధువుల ఇళ్లతో వెతికారు. ఎంత వెతికినా బాలరాజు ఆచూకీ లభించకపోవడంతో బుధవారం అతడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన పల్లెర్ల స్వామి ఫిబ్రవరి 20న తన భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం స్వామి భార్య భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62472, 87126 62733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


