వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

Apr 9 2026 8:23 AM | Updated on Apr 9 2026 8:23 AM

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

ప్రయాణ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ సూచించారు. చివ్వెంల మండలం జగన్‌నాయక్‌తండా శివారులో డీసీఎం, టాటా ఏస్‌ వాహనం ఢీకొన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ ఘటనకు గల కారణాలతో నివేదిక తయారు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement