శాలిగౌరారం పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శాలిగౌరారం పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం

Apr 9 2026 8:23 AM | Updated on Apr 9 2026 8:23 AM

స్టోర్‌రూంలో చిందరవందరగా

దర్శనమిస్తున్న సూది మందులు

ఫ్రిజ్‌లో పెట్టాల్సిన మందులను

బయట పెట్టిన వైనం

శాలిగౌరారం : శాలిగౌరారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అందాల్సిన సూది మందులు స్టోర్‌రూంలో చిందరవందరగా దర్శనమిస్తున్నాయి. పీహెచ్‌సీలో సూది మందులు భద్రపరిచే స్టోర్‌రూంలో ఇతర సామగ్రిని నింపారు. దీంతో జిల్లా కేంద్రం నుంచి పీహెచ్‌సీకి వచ్చిన సూది మందులు స్టోర్‌రూంలో భద్రపరిచేందుకు అవకాశం లేకపోవడంతో పీహెచ్‌సీలో బయట పెట్టారు. సూది మందుల్లో కొన్ని రకాలలను ఫ్రిజ్‌లో భద్రపరచాల్సి ఉంటుంది. కానీ వాటిని బయట ఉంచడంతో నిరుపయోగవవుతున్నాయి. అదేవిధంగా పీహెచ్‌సీకి వచ్చిన మందులను గ్రామాల్లోని హెల్త్‌ సబ్‌సెంటర్లకు పంపించి ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాగా కొన్ని హెల్త్‌ సబ్‌సెంటర్లకు కేటాయించిన సూది మందులను ఏఎన్‌ఎంలు తీసుకెళ్లకపోవడంతో వాటిని మూటగట్టి పీహెచ్‌సీలో ఓ మూలన పడేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

శాలిగౌరారం పీహెచ్‌సీ స్టోర్‌రూంలో స్థలం లేక బయట పెట్టిన మందుల స్టాక్‌

శాలిగౌరారం పీహెచ్‌సీ స్టోర్‌రూంలో

చిందరవందరగా పడి ఉన్న మందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement