తిరుమలగిరి (తుంగతుర్తి) : పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 13తో ముగియనున్నాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ కంటే పాలిటెక్నిక్ చదవితే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యా నిపుణులు చెబుతున్నారు. టీఎస్ పాలిసెట్‌కు ఈ నెల 20వ తేదీ వరకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహిస్తారు. విద్యార్థులు పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసి మూడేళ్ల పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా కోర్సులు చేయవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం ఉంటుంది.
ప్రశ్నలు ఇలా...
ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగానే విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పాలిసెట్‌లో ప్రవేశ పరీక్షలో పదో తరగతి నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అన్నీ మల్టిపుల్ చాయిస్‌లో ఉంటాయి. గణితంపై 60 మార్కులు, భౌతిక శాస్త్రంపై 30 మార్కులు, రసాయన శాస్త్రంపై 30 మార్కులతో మొత్తం 120 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. 2.30 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250.
ఉమ్మడి జిల్లాలో ఐదు కాలేజీలు..
ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, తిరుమలగిరి, యాదగిరిగుట్టలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళా శాలల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉంది.
ఫ ఈ నెల 20 వరకు గడువు
ఫ మే 13న ప్రవేశ పరీక్ష
ఫ ఉమ్మడి జిల్లాలో ఐదు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు


