టీ హబ్‌లో ముగిసిన ఇక్కత్‌ వస్త్ర ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

టీ హబ్‌లో ముగిసిన ఇక్కత్‌ వస్త్ర ప్రదర్శన

Apr 9 2026 8:23 AM | Updated on Apr 9 2026 8:23 AM

భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని టీ హబ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన రివర్స్‌ బయ్యర్‌ సెల్లర్‌ మీట్‌(ఆర్‌బీఎస్‌ఎం) బుధవారంతో ముగిసింది. పోచంపల్లి టై అండ్‌ డై అసోషియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు చేనేత వస్త్ర వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కత్‌ వస్త్రాలను ప్రదర్శించారు. చివరిరోజు దుబాయ్‌, మలేషియా, సింగపూర్‌, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రతినిధులతో టీజీటీపీసీ, జగదీశ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో వస్త్ర ఎగుమతులపై అవగాహన కల్పించారు. వస్త్రాల ఎగుమతుల్లో భాగంగా పాటించాల్సిన నాణ్యత, ఎకో ఫ్రెండ్లీ కలర్స్‌, డిజైన్‌ల గురించి వివరించారు. పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల ప్రదర్శన బాగుందని వివిధ దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి టై అండ్‌ డై సిల్క్‌ చీరల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కర్నాటి బాలరాజుతో పాటు పోచంపల్లి ప్రొడ్యూసర్‌ కంపెనీ ప్రొప్రైటర్‌ తడక రమేశ్‌, వస్త్ర వ్యాపారులు భారత లవకుమార్‌, దోర్నాల శేషగిరి, ఈపూరి ముత్యాలు, గంజి బాలరాజు, గంజి యుగేంధర్‌, సీత లక్ష్మణ్‌, వనం దశరథ, సీత కృష్ణ, అమరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement