ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం

Apr 9 2026 8:23 AM | Updated on Apr 9 2026 8:23 AM

ఈఎస్‌ఎస్‌సీఐ సౌత్‌ ఇండియా

రీజినల్‌ హెడ్‌ లాలూనాయక్‌

మఠంపల్లి : యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే విద్యా రంగాన్ని ఎలక్ట్రానిక్‌ రంగంతో అనుసంధానిస్తున్నామని ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌ఎస్‌సీఐ) సౌత్‌ ఇండియా రీజినల్‌ హెడ్‌ ధరావత్‌ లాలూనాయక్‌ అన్నారు. బుధవారం ఆయన తమ స్వగ్రామమైన మఠంపల్లి మండలం కామంచికుంటతండాకు వచ్చిన సందర్భంగా సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యావ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించేందుకు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అప్రెంటిషిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం (ఏఈడీపీ) చేపట్టామన్నారు. దీంట్లో భాగంగా బుధవారం ఉదయం ఈ విషయమై హైదరాబాద్‌లో సాంకేతిక విద్యా, కళాశాల విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన కలిసి నిర్వహించిన ఏఈడీపీ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, పరిశ్రమల అనుభవం అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే ఈ ప్రోగ్రాం లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఈఎస్‌ఎస్‌సీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ సరోజ్‌ అపాటో, వరుణ్‌ తదితరలు పాల్గొన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement