ఈఓకు ఫిర్యాదు చేశాను
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో ఒక్క కొబ్బరికాయ రూ.100కు అమ్ముతున్నారు. కొండపైన ఉన్న కొబ్బరికాయల దుకాణాలు ఎక్కడికి వెళ్లిన రూ.100 తీసుకొని ఒక్క కొబ్బరికాయతో పాటు కొద్దిగా తులసీ, రెండు పూలు ఇస్తున్నారు. ఇతర ఆలయాల్లో రూ.40 నుంచి రూ.50 వరకే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. కొండపైన కొబ్బరికాయలు అధిక ధరకు అమ్ముతున్న విషయాన్ని వీడియో రికార్డు చేసి, ఈఓకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాను. కొబ్బరికాయల దుకాణాలను దేవస్థానమే నడిపించాలి.
– కడారి శివ, భక్తుడు


