యాదగిరి క్షేత్రంలో కార్తీక ఆరాధన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సోమవారం కార్తీక మాసం పూజలు కొనసాగాయి. కొండపైన గల శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా మహాశివుడికి రుద్రాభిషేకం, బిల్వా అర్చన పూజలు విశేషంగా నిర్వహించారు. ఆలయ యాగశాలలో రుద్ర యాగాన్ని జరిపించారు. సాయంత్రం శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి సేవను ఆలయంలో ఊరేగించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు. ఆలయంలో వైభవంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుక, జోడు సేవలు వంటి పూజలు అర్చకులు జరిపించారు.
కొమ్మాయిపల్లిలో
నిర్డ్ బృందం
గుండాల : మండలంలోని కొమ్మాయిపల్లిలో సోమవారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూర ల్ డెవలప్‌మెంట్ (నిర్డ్) బృందం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను బృందం సభ్యులు తనిఖీ చేశారు. వివిధ పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రక్రియను ఎన్‌ఐఆర్‌డీ ప్రతినిధి విద్యులత పరిశీలించారు. వారివెంట ఎంపీడీఓ చండిరాణి, ఎంపీవో సలీమ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఆనంద్, పంచాయతీ కార్యదర్శులు భవాని, నాగరాజు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ యాకుపాషా, ఏఎన్‌ఎం కవిత తదితరులు ఉన్నారు.
వయోవృద్ధుల
సంక్షేమానికి ట్రిబ్యునల్
భువనగిరి : వయోవృద్ధుల సంక్షేమం, తల్లిదండ్రుల పోషణకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకునేందుకు భువనగిరి, చౌటుప్పల్ డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. సోమవారం భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలో ఉన్న సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, డాక్టర్ ప్రీతిస్వరూప్, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు వెంకటేశం, బాలేశ్వర్, అంజయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అద్దె చెల్లించాలని
కార్యాలయానికి తాళం
అడ్డగూడూరు : తహసీల్దార్ కార్యాలయం అద్దె బకాయిలు చెల్లిచాలని ఇంటి యజమాని తాళం వేశాడు. ఈ సంఘటన అడ్డగూడూరు మండల కేంద్రంలో సోమవారం చోటుసుకుంది. అడ్డగూడూరు తహసీల్దార్ కార్యాలయం నెలకు రూ.12,600 అద్దెతో ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది. అయితే భవనం యజమానికి ప్రభుత్వం రెండున్నరేళ్ల నుంచి అద్దె బకాయి రూ.2.13 లక్షలు చెల్లించడం లేదు. దీంతో యజమాని ఉదయం 10 గంటలకు కార్యాలయం తాళం వేశాడు. ఈ విషయంపై తహసీల్దార్ శేశగిరిరావును వివరణ కోరగా అద్దె బకాయి చెల్లించాల్సింది వాస్తవమేనని, అద్దె బిల్లు ఇవ్వాలని కల్టెకర్‌కు నివేదిక పంపినట్లు తెలిపారు. అనంతరం ఇంటి యజమానికి నచ్చజెప్పి మధ్యాహ్నం 12 తర్వాత కార్యాలయాన్ని తెరిచి కార్యాకలాపాలు కొనసాగించారు.
యాదగిరి క్షేత్రంలో కార్తీక ఆరాధన
యాదగిరి క్షేత్రంలో కార్తీక ఆరాధన
యాదగిరి క్షేత్రంలో కార్తీక ఆరాధన


