రూ.1,100 కోట్లతో అభివృద్ధి పనులు
భువనగిరిటౌన్ : భువనగిరి నియోజకవర్గంలో 1,100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వాటి ప్రారంభోత్సవానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి రానున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పరిధిలోని జగదేవ్‌పూర్ రోడ్డు విస్తరణ పనులు ఆయన ప్రారంభించి మాట్లాడారు. భువనగిరి పరిధిలోని అన్ని రోడ్లపై ప్రమాదాలు జరగకుండా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. జగదేవ్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల్లో మొదటి దశగా సుమారు 300 మీటర్ల పాటు వాటర్ ట్యాంకు వరకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలటీలకు హెచ్‌ఎండీఏ నుంచి రూ.56 కోట్లు వచ్చాయని, అందులో భాగంగా భువనగిరికి రూ.18 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. భీమలింగం వద్ద ముసీపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే ప్రస్తుతం తెలంగాణలో సాగు నీరు అందిస్తున్నట్లు, సీఎం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం కుడా సాగు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బునాదిగాని, పిల్లయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల విస్తరణ పనులకు 485 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు క్రాఫ్ హాలీడే ప్రకటించి మూసీ పైభాగంలో కాలువ విస్తరణ పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈ కొండల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేజ్ చిస్తీ, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, లయిఖ్‌అహ్మద్, పోలిశెట్టి అనిల్‌కుమార్, చల్లగురుగుల రఘుబాబు, అలాగే విలేకరుల సమావేశంలో అధికారులు శైలేంధర్, కృష్ణారెడ్డి, లావణ్య, భారత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ వైఎస్సార్ హయాంలో నిర్మించిన
ప్రాజెక్టులతోనే తెలంగాణకు సాగునీరు
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం
అనిల్‌కుమార్‌రెడ్డి


