ఫ్లైఓవర్‌పై నుంచి పడి వ్యక్తి దుర్మరణం
భువనగిరిటౌన్ : ఫ్లైఓవర్ పైనుంచి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం భువనగిరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని బహేర్‌పేట్‌కు చెందిన బానుక సంతోష్(34) పంక్చర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్ హైదరాబాద్–హన్మకొండ బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తూ.. నల్లగొండ ఫ్లైఓవర్‌పై నుంచి కింద రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష్ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడుతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య తెలిపారు.
విద్యుత్ తీగలపై వేలాడిన కోతి
● షార్ట్ సర్క్యూట్ జరిగి
ఇంట్లో నిల్వ చేసిన పత్తి దగ్ధం
గుండాల: విద్యుత్ తీగలపై కోతి గెంతులాడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి రైతు ఇంట్లో నిల్వ చేసిన పత్తి దగ్ధమైంది. ఈ ఘటన గుండాల మండలం మరిపడిగ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. మరిపడిగ గ్రామానికి చెందిన రైతు బోయిని అంజయ్య తన ఇంట్లో పత్తి నిల్వ చేశాడు. సోమవారం సాయంత్రం అంజయ్య ఇంటి సమీపంలోని విద్యుత్ తీగలపై ఓ కోతి గెంతులాడగా.. షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కాలిపోయి నిప్పు రవ్వలు పత్తికి అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు గమనించి వ్యవసాయ బావి వద్ద ఉన్న అంజయ్యకు సమాచారం ఇవ్వగా అతడు వచ్చి మంటలను ఆర్పివేశాడు. ఈ ప్రమాదంలో కోతి మరణించిందని గ్రామస్తులు తెలిపారు. రైతు ఇంట్లోని సుమారు 35 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ.2 లక్షల ఆస్థి నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బాధిత రైతు తహసీల్దార్ ఎస్. హరికృష్ణకు మంగళవారం వినతిపత్రం అందజేశాడు.
ఫ్లైఓవర్‌పై నుంచి పడి వ్యక్తి దుర్మరణం


