అర్జీలను వెంటనే పరిష్కరించాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు ఆదేశించారు. సోమవారం భువనగిరిలోని కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 41 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. రెవెన్యూ శాఖకు 29, ఎస్సీ వెల్ఫేర్ 4, జిల్లా పంచాయతీ 2, ఎంప్లాయ్‌మెంట్ టీమ్, మత్స్య శాఖ, మార్కెటింగ్, ఆర్‌టీసీ, చీఫ్ ప్లానింగ్, పోలీస్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయని తెలిపారు. కాగా ప్రజావాణి నడిచే సమయంలో అధికారులు తమ ఫోన్లలో బీజీగా గడుపుతూ కనిపించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
ఫ వలిగొండ మండలం అరూరులో మొద్దులగడి చెరువు (ఎఫ్‌టీఎల్)ను కబ్జా చేసినా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామస్తులు కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర నరసింహ అరూరు, మాజీ ఉపసర్పంచ్ సుక్క ముత్యాలు, ఎండోమెంట్ డైరెక్టర్ కోడితాల కరుణాకర్, కోపుల బాలరాజు, రెబ్బస్ సత్తయ్య, ఐలపాక సామి, నాగార్జున రెడ్డి, పోలపాక నరసింహ, దామెర అంజయ్య, జినుకల సాలయ్య, పిట్టల సుధాకర్, బండారు నరసింహారెడ్డి, బోలుగుల రాజు, కాదరి నరేష్, బుర్ర శ్రీశైలం, పందిరి సంపత్ ఉన్నారు.
ఫ భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన విజేత సంఘం సభ్యులు నుంచి రెండు నెలలు అదనంగా డబ్బులు వసూలు చేసి వాడుకున్న సంఘం అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సంఘం సభ్యులురాలు వినతి ప త్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మైముదా, యాష్మీన్, నశ్రీన్, రెహానా ఉన్నారు.
ఫ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని కేజీబీవీలోంచి డ్రెయినేజీ నీరు రోడ్డుపైకి వస్తుండడంతో దుర్వాసన వస్తుందని, దాన్ని నిలువరించాలని బస్వాపురం గ్రామానికి చెందిస సీపీఎం గ్రామ శాఖ అధ్యక్షుడు మచ్చ భాస్కర్ కోరారు. ఈ కార్యక్రమంలో మందెపురం బాలనర్సమ్మ, మచ్చ భూపాల్ ఉన్నారు.
ఫ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు
అర్జీలను వెంటనే పరిష్కరించాలి


