నిధుల్లేక నిలిపేశారు..
ప్రయోజనాలు ఇవీ..
మోత్కూరు : కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి గత ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సాంకేతికతను ఉపయోగించి రజకులకు మోడ్రన్ ధోబీఘాట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.2 కోట్ల చొప్పున జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు రూ.12కోట్లు కేటాయించింది. కానీ, మోత్కూరు మినహా మిగతా ఐదు చోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సరిపోను నిధులు లేకపోవడం, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు.
పనుల పురోగతి ఇలా..
జిల్లాలో భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీలకు మోడ్రన్ ధోబీఘాట్‌లు మంజూరయ్యాయి. మంజూరైన నిధుల్లో ఒక్కో మున్సిపాలిటీ రూ.50 లక్షలు యంత్రాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంది. మిగతా నిధులతో భవనాలను పూర్తి చేయాలి.
● మోత్కూర్‌లో బిక్కేరు వాగు చెంతన 2023 సెప్టెంబర్ 4న ధోబీఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా పూర్తి చేయడంతో అతనికి బిల్లులు కూడా వచ్చాయి. ఇక్కడ యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
● భువనగిరి, యాదగిరిగుట్టలో శంకుస్థాపనకే పరిమితం అయ్యాయి.
● చౌటుప్పలో భవనం ప్లాస్టింగ్ పూర్తయింది.
● భూదాన్‌పోచంపల్లిలో స్లాబ్ దశలో
నిలిచిపోయింది.
● యాదగిరిగుట్ట, ఆలేరులో భవనాలను పిల్లర్ల దశలో కాంట్రాక్టర్లు వదిలేశారు.
అసంపూర్తిగా మోడ్రన్ ధోబీఘాట్‌లు
ఫ ఒక్కోదానికి రూ.2 కోట్లు మంజూరు
ఫ రెండేళ్ల క్రితం పనులు ప్రారంభం
ఫ మోత్కూరు మినహా మిగతా ఐదు చోట్ల అసంపూర్తిగా నిర్మాణాలు
ఫ నిధులు సరిపోక, బిల్లులు రాక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
ఆధునిక ధోబీఘాట్‌ల పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే రజకులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వృత్తి పని సులువుకానుంది. పది మంది వారం రోజుల్లో చేసే పనిని యంత్రాలు గంటల్లోనే చేస్తాయి.ఒక్కో ధోబీఘాట్‌లో 200 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రజక సొసైటీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. సొసైటీలకు నిర్వహణ ఖర్చులు పోనూ నెలకు రూ.30వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
నిధుల్లేక నిలిపేశారు..


