పునరావాస గ్రామంలో కల్పించాల్సిన వసతులు
పునరావాస స్థలంలో ప్లాటింగ్ చేయాలి. రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. గ్రామ పంచాయతీ కార్యాలయం, పాఠశాల భవనం, ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు ఏర్పాటు చేసి ప్లాట్‌లను నిర్వాసితులకు అప్పగించాలి. ఈ పనులకు 2023 సెప్టెంబర్‌లో అప్పటి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉంది. నీళ్ల ట్యాంక్, విద్యుత్ కనెక్షన్ మినహా మరే పని మొదలుకాలేదు. ప్లాటింగ్ పూర్తయినా కేటాయించడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్లాట్‌లు అప్పగించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.


