మగ్గాలకు శాశ్వత జియోట్యాగింగ్ నంబర్లు
ఆలేరు: చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకుగాను జౌళిశాఖ ఆధ్వర్యంలో మగ్గాలకు శాశ్వత జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆలేరు పట్టణంలోని భారత్‌నగర్, సిల్క్‌నగర్, కాటమయ్య బస్తీ, మార్కండేయ కాలనీలోని మగ్గాలకు ఏజెన్సీ సిబ్బంది పర్మినెంట్ జియోట్యాగింగ్ నంబర్లు కేటాయించారు. మగ్గాలకు బార్‌కోడ్ స్టిక్కర్లు అంటించారు. ఈప్రక్రియ ద్వారా మగ్గం ఉన్న ప్రాంతం, చేనేత కార్మికుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందని ఏజెన్సీ సిబ్బంది చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నిర్ణీత గుడువు లోపు బార్‌కోడ్ స్టిక్కరింగ్ వేయడం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ సిబ్బంది సునీల్‌కుమార్, అమృతం, నర్సింహులు, మెరుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


