ప్లాటింగ్ పూర్తయినా అప్పగించడం లేదు
రిజర్వాయర్‌లో మాది నాలుగు ఎకరాల భూమి పోయింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ప్లాట్‌లు ఇస్తలేరు. ప్లాట్‌లు కేటాయిస్తే అందులో ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాం. త్వరగా పునరావాసం కల్పించాలి. –దీరావత్ మంజా, నిర్వాసితుడు
రిజర్వాయర్ నిర్మాణం కోసం తండా చుట్టూ కట్ట వేశారు. వర్షాలకు తండాలోకి నీరు చేరుతుంది.బయటకు వెళ్లేదారి లేకుండాపోయింది. రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. త్వరగా ప్లాట్లు ఇవ్వాలి. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. –శంకర్‌నాయక్, నిర్వాసితుడు
పునరావాస గ్రామానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచింది. ప్లాటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు ప్లాట్లు కేటాయించలేదు. నా కుటుంబంలో మా అమ్మాయికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రాలేదు. సమస్యను ప్రభుత్వ విప్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. –ధీరావత్ జహంగీర్, నిర్వాసితుడు
ప్లాటింగ్ పూర్తయినా అప్పగించడం లేదు
ప్లాటింగ్ పూర్తయినా అప్పగించడం లేదు


