ఎక్కువగా రెవెన్యూ సమస్యలే..
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతులు స్కీరించారు. 68 అర్జీలు రాగా అందులో అధికంగా 56 అర్జీలు రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ప్రజా వాణి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
రైతులకు ఇబ్బంది కలగొద్దు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో విజిట్ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజావాణి ముగిసిన అనంతరం ప్రత్యేక అధికారులతో సమావేశమైన ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. నిర్ధిష్ట తేమశాతం రాగానే కాంటా వేయించి ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి చేయాలని ఆదేశించారు. లారీల కొరత ఏర్పడుకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఫ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వినతులు


