బీసీ రాజ్యాధికార పార్టీకే అధికారం | - | Sakshi
Sakshi News home page

బీసీ రాజ్యాధికార పార్టీకే అధికారం

Nov 5 2025 8:40 AM | Updated on Nov 5 2025 8:40 AM

బీసీ రాజ్యాధికార పార్టీకే అధికారం

బీసీ రాజ్యాధికార పార్టీకే అధికారం

నల్లగొండ: 2028లో బీసీ రాఽజ్యాధికార పార్టీ ఽఅధికారంలోకి వస్తుందని, బీసీ ముఖ్యమంత్రి అవుతాడని బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్‌లో జానారెడ్డి దీన్ని అడ్డుకున్నాడని ఆరోపించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో శ్రీఓపెన్‌ టాక్‌ విత్‌ మల్లన్నశ్రీ నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రశ్నలు వేయగా మల్లన్న వాటికి సమాధానాలు చెప్పారు. తన రాజ్యాధికార పార్టీలో బీసీలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని, ఓసీలకు చట్ట సభలో 5 టికెట్లు మాత్రమే ఇస్తామన్నారు. తమ పార్టీలో అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. సామాజిక, ఆర్ధిక న్యాయం జరుగుతుందని, వ్యక్తి ఆరాధన ఉండదని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి మొదలుకుని సర్పంచ్‌ వరకు, తహసిల్దార్‌ నుంచి కలెక్టర్‌ వరకు అన్ని కార్యాలయాల ముందు డిజిటల్‌ టీవీలు ఏర్పాటు చేస్తారని, లోపల ముఖ్యమంత్రి, కలెక్టర్లు, గ్రామాల్లో సర్పంచ్‌లు, ప్రజలు బయట ఆన్‌లైన్‌లో చూసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ప్రజల డబ్బు నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు రహస్యంగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.

విద్యకు అతి తక్కువ ఖర్చుపెట్టింది తెలంగాణే.....

దేశంలో విద్యా వ్యవస్థకు అతి తక్కువ ఖర్చు పెట్టేది తెలంగాణ ప్రభుత్వమేనని, ఈ ప్రభుత్వానికి బుద్ది లేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ జెండాల తరహాలో రాజ్యాదికార పార్టీ జెండా ఉండదని, మా గుండెల మీద పూలే వంటి మహనీయుల బొమ్మలు ఉంటాయి కాబట్టి జెండాలపై బొమ్మలు పెట్టలేని విద్యార్థి సంఘం నాయకుడు అడిగిన ప్రశ్నకు మల్లన్న సమాధానం చెప్పారు. పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తే పిల్లలు తప్పులు చేయరని అన్నారు. అలాంటి విద్యా విధానాన్ని తమ పార్టీ అమలు చేయబోతుందన్నారు.

సీఎంకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని లేదు....

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి లేడని మల్లన్న ఆరోపించారు. బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఈ జన్మలోనే ఏదో ఒకటి చేయాలి. మల్లన్నకు మరల జన్మ అనేది రాదు. కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించానని చెప్పారు. మొదటి బడ్జెట్‌లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని మల్లన్న చెప్పారు. బీసీలకు సబ్‌ ప్లాన్‌ అమలు చేయబోతున్నామన్నారు. బీసీలకు ప్రభుత్వాలు కార్పోరేషన్లు ఇచ్చి అభివృద్ధి అని చూపెడుతున్నాయని, వాటిని నమ్మవద్దన్నారు.

కుల గణన తప్పుల తడక..

కుల గణన తప్పుల తడక అని తాము ఆధారాలతో బయట పెట్టామన్నారు. ప్రభుత్వం దగ్గర గాడిదల లెక్కలు ఉన్నాయి కాని, కులాల వారీగా జనాభా లెక్కలు లేవని ఆయన విమర్శించారు. బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టే ప్రభుత్వం కోర్టుకు డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టును, జనాభా సర్వే రిపోర్టు ఇవ్వలేదన్నారు. దీంతో కోర్టు కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొట్టేసిందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అన్ని ముఖ్యమైన రంగాల్లో బీసీలకు అవకాశం లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎస్సీ సెల్‌, బీసీ సెల్‌ పెట్టిన విధంగానే మా రాజ్యాధికార పార్టీలో ఓసీ సెల్‌ పెట్టి వారికి పదవులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూదగాని హరిశంకర్‌గౌడ్‌, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ బందారపు నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వట్టె జానయ్యయాదవ్‌, సంగెం సూర్యారావు, బీసీ జేఏసీ నాయకులు డేగల జనార్దన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌, దుడుకు లక్ష్మీనారాయణ, ఐతగాని జనార్దన్‌గౌడ్‌, మేధావులు, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఫ అవినీతి, అక్రమాలకు

మా పార్టీలో తావుండదు

ఫ 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి

ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు

ఫ కుల గణన రిపోర్టు ప్రభుత్వం

కోర్టుకు ఇవ్వనందున కొట్టేసింది

ఫ బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement