చౌటుప్పల్: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లోని ట్రినిటీ స్కూల్ సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు మంగళవారం చౌటుప్పల్‌లో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయా జిల్లాలకు చెందిన జట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో ప్రాచీణమైన మల్లఖంబ్ క్రీడను నేటి విద్యార్ధులకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని అన్నారు. భావితరాల కోసం విద్యారంగానికి ఎంత ఖర్చు చేసినా తక్కువేనని తెలిపారు. అందులో భాగంగానే తాను ప్రభుత్వ నిధులతో పాటు తన మాతృమూర్తి పేరిట నడుస్తున్న సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలు, హాస్టళ్లను బాగు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని గుర్తుచేశారు.
168మంది క్రీడాకారుల హాజరు
అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగే ఈ మల్లఖంబ్ పోటీల్లో పాల్గొనేందుకు 7 ఉమ్మడి జిల్లాల నుంచి జట్టుకు 24మంది చొప్పున 168మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను ఈ నెలలోనే జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంఈఓ గురువారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి, డీఈఓ కె. సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, గాంధీ గ్లోబల్ ఫ్యామిటీ ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ దశరథరెడ్డి, ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ. కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఎస్‌జీఎఫ్ మండల సెక్రటరీ ఏ. లింగయ్య, ఆయా జిల్లాల నుంచి వచ్చిన కోచ్‌లు, క్రీడాకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ఫ 7 ఉమ్మడి జిల్లాల నుంచి
168మంది క్రీడాకారులు హాజరు
చౌటుప్పల్‌లో రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు
చౌటుప్పల్‌లో రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు


