‘తెల్ల’బోతునా్నరు! | - | Sakshi
Sakshi News home page

‘తెల్ల’బోతునా్నరు!

Nov 6 2025 7:24 AM | Updated on Nov 6 2025 7:24 AM

‘తెల్ల’బోతునా్నరు!

‘తెల్ల’బోతునా్నరు!

సాక్షి, యాదాద్రి: పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన వరుస వర్షాలకు నష్టాన్ని చవిచూడగా, పంట చేతికొచ్చే దశలో మోంథా తుఫాన్‌ కోలుకోకుండా చేసింది. మిగిలిన పత్తిపై ఆశలు పెంచుకున్న రైతులకు నిబంధనల కత్తి మెడపై వేలాడుతోంది. ఎకరానికి 7 క్వింటాళ్లు పరిమితి విధించడంతో అధిక దిగుబడి వచ్చిన రైతులు అయోయంలో ఉన్నారు. మరోవైపు స్లాట్‌ బుకింగ్‌కు ఆడ్డంకులు ఎదురవుతున్నాయి. తేమ శాతం సాకుగా చూపి సీసీఐ కేంద్రాల్లో కొనుగోలుకు నిరాకరిస్తుండటంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

ఓపెన్‌ కాని సైట్‌

సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించాలంటే రైతులు స్లాట్‌ బుకింగ్‌ చేయాలి. రైతుల వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం, గ్రామాల్లో సిగ్నల్స్‌ అందకపోవడంత కసాప్‌ కిసాన్‌ యాప్‌ ఓపెన్‌ కావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ సెంటర్లు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సీసీఐ కేంద్రాల్లో ఎకరాలకు 12 క్వింటాళ్ల పత్తి అమ్ముకునేందుకు గతంలో రైతులకు వెసులుబాటు ఉండేది. కాగా తాజాగా ఏడు క్వింటాళ్ల పరిమితి విధిస్తూ కేంద్రం తాజాగా తీసుకువచ్చిన కొత్త రూల్‌ రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. నానా అవస్థలు పడి స్లాట్‌ బుక్‌ చేసి, పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ మాయిశ్చర్‌ ఎక్కువ ఉందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఒకసారి స్లాట్‌ బుక్‌ చేస్తే 24 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. మళ్లీ స్లాట్‌ బుక్‌ కాకపోవడంతో రైతులు తీసుకెళ్లిన పత్తిని తిరిగి ఇంటికి తెస్తున్నారు.

నిర్ధిష్ట తేమ శాతం ఉన్నా కొర్రీలే..

తేమశాతం 15నుంచి 18 ఽమధ్య ఉన్నా కొనుగోలు చేయడానికి సీసీఐ అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి వేచి ఉండలేక దళారులకు అమ్ముకుంటున్నారు. దళారులు ఇదే అదనుగా తీసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. హమాలీల కూలీ, వాహనాల చార్జ్‌, వెయిటింగ్‌ చార్జ్‌, తేమ శాతం తదితర కారణాలతో తీవ్రంగా నష్టపోతున్నారు.

రైతుల పేరుతో దళారుల దందా

దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువస్తున్నా దళారులు రూట్‌ మార్చి దందా చేస్తున్నారు. రైతుల పాస్‌ పుస్తకాలు తీసుకువచ్చి వారి పేరునే పత్తి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు స్లాట్‌ బుక్‌ కాకుండా పరోక్షంగా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. సీసీఐ అధికారులు సైతం దళారులతో కుమ్మక్కవుతున్నారు. రైతుల పేరుతో దళారులు తెచ్చిన పత్తి.. నిర్ధిష్ట శాతానికి ఎక్కువగా తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.

రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు

ఫ పత్తి ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి

ఫ తేమ పేరుతో కొనుగోలుకు కొర్రీలు

ఫ స్లాట్‌ బుకింగ్‌కు ఆటంకాలు

ఫ దిక్కుతోచని స్థితిలో కర్షకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement