గుట్ట ఆలయ పవిత్రతను కాపాడుదాం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. యాదగిరీశుడి క్షేత్రంలో అవినీతి, అక్రమాలపై విచారణ చేయించి, బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 11 జ్యోతులతో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఈఓ, డిప్యూటీ ఈఓ, ఏఈఓ స్థాయి అధికారులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుండగా.. ఆలయంపై పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. యాదగిరి క్షేత్ర పరిరక్షణ కోసం తాము చేస్తుంది ఉద్యమం కాదని, ధర్మయుద్ధం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, ప్రధాన కార్యదర్శులు కాదూరి అచ్చయ్య, చందా మహేందర్, యాదిరెడ్డి, ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శులు కృష్ణ, కొక్కొండ లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పక్కీర్ రాజేంజేందర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీసభ్యులు రచ్చ శ్రీనివాస్, పట్టణ, మండల అధ్యక్షులు కర్రె ప్రవీణ్, గుంటిపల్లి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


