మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు ఆలయ ముఖమండపంలో స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన గావించారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజావాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
రాత్రి వేళల్లోనూ ధాన్యంకాంటా వేయాలి
యాదగిరిగుట్ట రూరల్: ధాన్యం నిర్ధిష్ట తేమశాతం వస్తే రాత్రి సమయంలో కూడా కాంటా వేయాలని కలెక్టర్ హనుమంతరావు నిర్వాహకులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లతో భద్రపరచుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ధాన్యం కుప్పల వద్దకు తేమశాతం చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ గణేష్ నాయక్, ఏడీఏ శాంతినిర్మల, ఏఓ సుధారాణి, ఏఈఓ శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈఓ భద్రారెడ్డి ఉన్నారు.
ఎయిమ్స్ డైరెక్టర్‌ను కలిసిన ఎంపీ
బీబీనగర్: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్‌ను కలిశారు. ఎయిమ్స్ అభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం కల్పిస్తున్నవి, కల్పించాల్సిన మౌలిక సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, ఎయిమ్స్ వద్ద అన్ని బస్సులు ఆపించాలని, ఉప్పల్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీకి ఎయిమ్స్ అధికారులు విన్నవించారు.
వాహనాలరద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్ – విజయవాడ జాతీ య రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో సోమవారం వాహనాల రద్దీ నెలకొంది. సాయంత్రం సమయంలో పాఠశాలలు విడిచిపెట్టడం, అదే సమయంలో వర్షం తగ్గడంతో రోడ్ల వెంట ని లిపిన వాహనాలు ఒక్కసారిగా బయలుదేరాయి.
మహాశివుడికి సంప్రదాయ పూజలు
మహాశివుడికి సంప్రదాయ పూజలు


