కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని ఆలయ అధికారులు దుకాణదారులకు సూచించారు. సోమవారం సాక్షి దినపత్రికలో శ్రీఅంతా ఇష్టారాజ్యంశ్రీ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయాధికారులు స్పందించారు. దీంతో ఇన్‌చార్జ్ డిప్యూటీ ఈఓ దూశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు కొండపైన దుకాణాదారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ ఎంతకు అమ్ముతున్నారనే అంశాలను పరిశీలించారు. ఒక్క కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని, రూ.100కు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవస్థానం నిర్ణయించిన రూ.40కే కొబ్బరికాయ అమ్మాలని స్టిక్కర్లు సైతం అతికించారు. మరోసారి అధిక ధరలకు విక్రయిస్తే దేవస్థానం యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, టెండర్ సైతం రద్దు చేస్తామన్నారు. ఇన్‌చార్జ్ డిప్యూటీ ఈఓ వెంట ఏఈఓ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ రాకేష్‌రెడ్డి, అడ్మినిస్టేషన్ ఏఈఓ మహేష్ తదితరులున్నారు.
ఫ కొండపైన దుకాణాదారుల వద్దకు వెళ్లి పరిశీలించిన ఇన్‌చార్జ్ డిప్యూటీ ఈఓ


