వైభవంగా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం యాగ్నికులు సముద్రాల వెంకటరమణ ఆధ్వర్యంలో స్వామివారిని ఊరేగింపుగా తోడ్కొని వచ్చి తిరు కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణానికి ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరుకు చెందిన నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఘాట్ రోడ్డుకు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రేలింగును ప్రారంభించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ దశరథ, వాకిటి అనంతరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన బాబు, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, గుర్రం లక్ష్మ రెడ్డి, బోల శ్రీనివాస్, బత్తిని సహదేవ, కంకల కిష్టయ్య పాల్గొన్నారు.


