వదలని వరుణుడు
పలు మండలాల్లో భారీ వర్షం
ఫ కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం
ఫ నీట మునిగిన పొలాలు
చౌటుప్పల్ : అన్నదాతను వరుణుడు వదలడం లేదు.ఆదివారం రాత్రి, సోమవారం పలు మండలాల్లో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పల కిందికి నీరు చేరింది. ఆరబోసిన ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్పలుగా చేసుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. వారం రోజుల్లోనే మూడు సార్లు వర్షం కురవడంతో ధాన్యం నిర్ధిష్ట తేమశాతం రాక కాంటా వేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
మోత్కూరు: వర్షానికి సదర్శాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్మూరిబావి చెరువు కింద ఉన్న పొలాలు ముంపునకు గురయ్యాయి. కోత దశలో ఉన్న 12 ఎకరాల వరి పొలాలు పూర్తిగా నీట మునిగినట్లు రైతులు దొండ శ్రీశైలం, కొమ్మూరి కరుణాకర్‌రెడ్డి, కొమ్మూరి వెంకట్‌రెడ్డి, కొమ్మూరి నర్సిరెడ్డి, కొమ్మూరి యాదిరెడ్డి తెలిపారు.
అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వర్షం కురిసింది. అడ్డగూడూరు పెద్దచెరువు అలుగు పోస్తుడటంతో కోత దశలో ఉన్న పొలాలు నీట మునిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్య తడిసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు.
రామన్నపేట : వర్షానికి రామన్నపేట మార్కెట్ యార్డులో వడ్లు కొట్టుకుపోయాయి. వరుస వర్షాలకు ధాన్యం కుప్పల కిందకు నీరు చేరి మొలకెత్తుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వదలని వరుణుడు


