
స్వర్ణగిరీశుడికి గజవాహన సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి గజవాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం, వసంతోత్సవం, సాయంత్రం హనుమంత వాహనసేవ, రాత్రి జలనారాయణ స్వామికి మంగళహరతుల సమర్పణ తదితర పూజలు నిర్వహించారు.