
లక్ష ్యం.. ప్రథమ స్థానం
బాధ్యతగా పనిచేయాలి
భువనగిరి: పదో తరగతి ఫలితాల్లో యాదాద్రి జిల్లాను గత విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఏడవ స్థానంలో నిలిపిన విద్యాశాఖ అధికారులు.. ఈసారి మొదటి స్థానంపై గురిపెట్టారు. ఈ మేరకు తొలి విడతలో 66 రోజులకు ప్రణాళిక రూపొందించారు. దీన్ని సోమవారం (నేడు) నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలో పదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 157, మోడల్ స్కూళ్లు 7 ఉన్నాయి. వాటిలో 4,754 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు.
కార్యాచరణ ఇదీ..
● ఉత్తమ ఫలితాల సాధనకు నిపుణులచే రూపొందించిన అభ్యాస దీపికలను నేడు విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
● నేటి నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి.
● వారంలో అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
● రోజూ ప్రత్యేక తరగతుల అనంతరం స్లిప్ టెస్ట్ నిర్వహిస్తారు.
● విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దనున్నారు.
● డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి చేస్తారు.
● జనవరి1 నుంచి సిలబస్ రివిజన్ ఉంటుంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
నాలుగేళ్లుగా ఉత్తీర్ణత
సంవత్సరం శాతం స్థానం
2021–22 93.61 13
2022–23 80.97 23
2023–24 90.44 25
2024–25 97.80 07
‘పది’లో మెరుగైన ఫలితాల సాధనకు కార్యాచరణ
నేటి నుంచి ప్రత్యేక తరగతులు
ప్రతి రోజూ స్లిప్ టెస్ట్‌లు
డిసెంబర్ 31లోగా సిలబస్ పూర్తి
గత ఏడాది జిల్లాకు 7వ స్థానం
ఈసారి మొదటి స్థానంపై గురి
టెన్త్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయటానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకో సం 66 రోజుల కార్యాచరణ రూపొందించి ప్రధానోపాధ్యాయులకు పంపడం జరిగింది. నేటినుంచి రోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. గత సంవత్సరం కలెక్టర్ సొంత ఆలోచనతో వినూత్న కార్యక్రమాలు అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రథమ స్థానం లక్ష్యంగా పనిచేస్తాం. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
– సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి

లక్ష ్యం.. ప్రథమ స్థానం