ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌

Oct 5 2025 11:22 AM | Updated on Oct 5 2025 11:22 AM

ఆదర్శ

ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌

వరించిన అవార్డులు

విద్యాభివృద్ధికి వెంకట్‌రెడ్డి చేస్తున్న కృషికి గుర్తింపుగా గ్లోబల్‌ టీచర్‌ అవార్డు, జాతీయ విద్యారత్న అవార్డు, జాతీయ పుడమి అవార్డు, తెలంగాణ ప్రతిభారత్న, మదర్‌థెరిస్సా ఉత్తమ సేవా పురస్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ వారిచే రెండుసార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లాంటి మరెన్నో అవార్డులు లభించాయి.

పెద్దవూర: ఆయన ఏ పాఠశాలలో పనిచేసినా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు పెద్దవూర మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకట్‌రెడ్డి. ఆయన పనిచేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, రీసోర్స్‌పర్సన్‌గా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాస తరగతుల నిర్వహిస్తూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఫ 2001 డీఎస్సీలో ఎంపికై న వెంకట్‌రెడ్డి నిడమనూరు మండలం కుంటిగొర్లగూడెం పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి అక్కడే 2009 వరకు హెచ్‌ఎంగా పనిచేశారు. ఇక్కడ పక్కా భవనం లేకపోవడంతో ఐదున్నరేళ్లు చెట్ల కిందనే పాఠశాలను కొనసాగించి అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్ది ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. పాఠశాలకు పక్కా భవనం మంజూరైనా స్థలం లేకపోవడంతో గ్రామానికి చెందిన అబ్బయ్య తన సొంత ఇంటి స్థలాన్ని పాఠశాలకు కేటాయించారు. వెంకట్‌రెడ్డి సార్‌ ప్రోత్సాహంతో నేడు ఆ గ్రామంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వంటి ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారు. 2009లో వేములపల్లి మండలం శెట్టిపాలెం హెచ్‌ఎంగా బదిలీపై వెళ్లి 65 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను 108 మందికి పెంచారు. 2015లో త్రిపురారం మండలం బాబుసాయిపేట యూపీఎస్‌కు బదిలీపై వెళ్లారు. మూతపడే స్థితిలో ఉన్న ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 150 మందికి పెంచారు. ఇంగ్లిష్‌ మీడియంను కూడా ప్రారంభించారు. తొమ్మిదేళ్ల పాటు విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బెల్టులు, టై, నోట్‌బుక్స్‌తో పాటు భోజనం ప్లేట్లను సైతం పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆయా గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి ఉన్నత చదువులు చదివేలా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహించారు. గత 15 ఏళ్లుగా ప్రాథమిక స్థాయి గణితంతో పాటు వివిధ అంశాలపై జిల్లా రీసోర్స్‌పర్సన్‌గా, మాస్టర్‌ ట్రైనర్‌గా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలిమెట్టు కార్యక్రమంలో స్టేట్‌ రీసోర్స్‌పర్సన్‌గా గణిత ఉపాధ్యాయ కరదీపిక రూపకల్పనలో భాగస్వామ్యమి అయ్యారు.

గ్లోబల్‌ టీచర్‌ అవార్డు అందుకుంటున్న వెంకట్‌రెడ్డి

విద్యార్థులకు యోగాసనాలు నేర్పిస్తున్న

ఉపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి

టై, బెల్టులు పంపిణీ చేస్తున్న వెంకట్‌రెడ్డి

ఫ ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ప్రభుత్వ టీచర్‌

ఫ పలు అవార్డులు ఆయన సొంతం

నేడు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌1
1/2

ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌

ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌2
2/2

ఆదర్శ ఉపాధ్యాయుడు.. వెంకట్‌రెడ్డి సార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement