
రైతులకు అన్యాయం జరగనివ్వను
చిట్యాల: రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతులున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో శనివారం ఆయనను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని, సంస్థాన్‌నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు కలిశారు. ఈ సంర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఇంకా ఎలాంటి అలైన్‌మెంట్ జరగలేదని అన్నారు. ప్రభుత్వం, అధికారులు చెప్పేంత వరకు వివిధ పత్రికల్లో అలైన్‌మెంట్‌పై వస్తున్న కథనాలను నమ్మొద్దని అన్నారు. గ్రామాల్లో అధికారులతో సభలు నిర్వహించి రైతుల అంగీకారంతోనే న్యాయమైన పరిహారం చెల్లించి భూసేకరణ చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
జాతీయ రహదారికి మరమ్మతులు..
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని 2022లోనే విస్తరణ చేయాల్సిందన్నారు. కానీ జీఎంఆర్ సంస్థ పనులు చేపట్టకపోవటంతో పాటు రహదారి నిర్వహణ నుంచి వైదొలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైవే పలు చోట్ల ధ్వంసమైందని, మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. హైవే విస్తరణతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లుతో విస్తరించేందుకు డిసెంబర్‌లో టెండర్లు పిలిచి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను మరో 250 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వివరించారు. అనంతరం రీజినల్ రింగ్ రోడ్డు రైతులు పల్లెల పుష్పారెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, పగిళ్ల మోహన్‌రెడ్డి మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో చిట్యాల మున్సిపాలిటి మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, చౌటుప్పల్ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, ఆవుల యాదయ్య, దోర్నాల రామచంద్రం, నీలకంఠం లింగస్వామి, ఇబ్రహీం, ఎడ్ల మహాలింగం తదితరులు పాల్గొన్నారు.
ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి