
రెండు బైక్‌లు ఢీకొని..
నాంపల్లి: రెండు బైక్‌లు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నాంపల్లి మండలం తీపిగౌరారం గ్రామానికి చెందిన జిల్లాల సాయిలు (64) నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి దారి వెంట వెళ్లే బైక్‌ను ఆపి నాంపల్లికి వస్తున్నాడు. మార్గమధ్యలో మండల కేంద్రం నుంచి మరుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ సాయిలు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న సాయిలు కింద పడి తలకు గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్థానికులు మృతదేహాన్ని తీసుకెళ్లనీయకుండా ఆందోళన చేయడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండకు తరలించారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.