
యాదగిరిగుట్ట: దసరాకు సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఆదివారం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. దసరా సెలవులు నేటితో ముగుస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పడుతుంది , వీఐపీ దర్శనానికి గంట సమయం. (నిన్న) శనివారం స్వామివారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.41,31,970 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
నూతన తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.