
శిల్పారామంలో ముగిసిన దసరా ఉత్సవాలు
భువనగిరి: భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలో గల మినీ శిల్పారామంలో సెప్టెంబర్ 29 నుంచి జరుగుతున్న దసరా ఉత్సవాలు అదివారం ముగిశాయి. చివరిరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య క్రమాలు అలరించాయి. హైదరాబాద్‌కు చెందిన తుమ్మాటి ప్రణవి శిష్యబృందం కళాకారులు కూచిపూడి నృత్యం ప్రద ర్శించి అలరించారు. సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో పెద్ద సంఖ్యలో.. మినీ శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. చెరువులో బోటు షికారు చేసి, పార్కులో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారిణులు అంజని, కీర్తన, సహస్ర, ప్రదీక్ష, రితిక, సాన్వి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.