
ప్రజావాణి రద్దు
భువనగిరి: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం యథావిధిగా కొనసాగుతుందని, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.
నేడు పీఓలకు శిక్షణ
భువనగిరిటౌన్ : ప్రిసైడింగ్ ఆఫీసర్లకు (పీఓ) సోమవారం భువనగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరైనా సెలవుల్లో ఉంటే రద్దు చేసుకొని రావాలని పేర్కొన్నారు. హాజరుకాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో హెల్స్‌డెస్క్ ఏర్పాటు చేశారు. సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ఫిర్యాదులు చేసేందుకు 8978928637ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
యాదగిరి క్షేత్రంలో
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం, ఆరాధన సేవలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో సు వర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు గావించారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవార్తకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.