వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు | - | Sakshi
Sakshi News home page

వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు

Oct 6 2025 1:51 AM | Updated on Oct 6 2025 1:51 AM

వందల్

వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు

పోస్టుల భర్తీకి ప్రతిపాదన చేశా

ఆలేరు: పేరుకేమో పెద్దాస్పత్రి.. రోగులకు పూర్తిస్థాయిలో సేవలు మాత్రం అందడం లేదు. అవసరమైన సదుపాయలు కల్పించకపోవడం, వైద్యుల కొరత వేదిస్తోంది. ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) నిపుణులు లేకపోవడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రి, ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తోంది. అరకొరగా ఉన్న వైద్యులు కూడా చుట్టపుచూపులా విధులకు హాజరవుతున్నారన్న విమర్శలున్నాయి. ఆస్పత్రికి ఆలేరు పట్టణం, ఆలేరు మండలంతో పాటు, గుండాల, మోటకొండూరు మండలా లు, బచ్చన్నపేట తదితర ప్రాంతాల నుంచి నిత్యం 300 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ, రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు లేరు.

100 పడకలు.. ప్రకటనకే పరిమితం

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 100 పడకలకు పెంపు ప్రకటనకే పరిమితమైంది. ప్రస్తుతం 30 పడకలే ఉండటం, ఇన్‌పేషెంట్‌లు 50 మంది వరకు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న వైద్యులు

రెండు డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులకు ఒకటి, అనస్తిషీయన్‌, ఆర్‌ఎంఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల్లో ఒకటి భర్తీ చేయగా, మరొకరిని డిప్యూటేషన్‌పై నియమించారు. రెండు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌(పీడియాట్రిక్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సర్జన్‌ ఖాళీగా ఉంది. డిప్యూటేషన్‌లో రేడియాలాజిస్ట్‌ భర్తీ చేశారు. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఒక స్టాఫ్‌ నర్సు, రెండు వార్డు బాయ్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు గైనకాలాజిస్ట్‌లు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా రావడం లేదనే విమర్శలున్నాయి.

దంత సమస్యలు వస్తే అవస్థలే..

దంత సమస్యలతో రోజూ కనీసం పది మంది ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి చికిత్స చేసే పరిస్థితి లేదు. ఏడాదిన్నరగా డెంటల్‌ డాక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండటమే కారణం. ఇద్దరు చిల్డ్రన్స్‌ డాక్టర్లు లేక జ్వరాలు, అంటువ్యాధులు సోకినప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో వైద్యనిపుణుల కొరత

రోగులకు పూర్తిస్థాయిలో

అందని సేవలు

భువనగిరి, జనగామ, ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్న సిబ్బంది

రోజూ 300కు పైగా ఓపీ..

సాధారణ రోజుల్లో సుమారు 300, సీజన్‌లో 400 వరకు ఓపీ ఉంటుంది. ఓపీ ఆలస్యంగా ప్రారంభించడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు.రక్త,మూత్ర తదితర పరీక్షలకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆస్పత్రిలో కొన్ని మందులు లభించక ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు విభాగాల్లో యంత్రాలు వృథాగా ఉన్నాయి.

సీహెచ్‌సీలో పలు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశాను. వైద్యులు విధులకు సరిగా హాజరుకావడం లేదనే విమర్శలు వాస్తవం కాదు. ఉన్న డాక్టర్లతోనే రోగులకు మె రుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం.

–స్వప్నరాథోడ్‌, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌

వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు 1
1/2

వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు

వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు 2
2/2

వందల్లో రోగులు.. ఏడుగురే వైదు్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement