
కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది
యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, బీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి, శారాజీపేట మాజీ సర్పంచ్ బెంజారం రజిని, సిల్క్ రేణుకా వెంకటేశం, నిరోషా, పెండ్యాల ప్రకృతి రాజు, పుట్టల స్వామిలతో పాటు పలువురు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్పు కోరుకుని ప్రజలంతా కాంగ్రెస్‌కు పట్టం కడితే.. రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లి ఎవరిని కదిలించినా కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అధికస్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆలేరు మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రచ్చ రాంనర్సయ్య, బండ మహేందర్, ఆశయ్య, శ్రీధర్, కంది మహేందర్, అశోక్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, శనివారం రవి, కడారి బాలయ్య, రచ్చ కావ్య, సిద్దేశ్వర్, సముద్రాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత