
యాదగిరీశుడి సేవలో పాదరాజ మఠం పీఠాధిపతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి శ్రీసుజయనిధి తీర్థ ముల్బాగల్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠ అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
యాదగిరిగుట్టలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
యాదగిరిగుట్ట: దసరా పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద సోమవారం రాత్రి బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి యాదగిరి క్షేత్రానికి భక్తులు వస్తుండటంతో పాటు సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు సిబ్బంది వెల్లడించారు.