
స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చన, అక్షరాభ్యాసం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుమందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు.
విద్యాలక్ష్మి అమ్మవారి వద్ద చిన్నారులకు
అక్షరాభ్యాసం చేయిస్తున్న అర్చకులు