
లైబ్రరీ సైన్స్‌లో ఇంద్రకుమార్‌కు గోల్డ్ మెడల్
ఆలేరు: డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2022–23 సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ (బీఎల్‌ఐఎస్‌సీ) విభాగంలో అత్యుత్తమ మార్కుల సాధించిన ఆలేరు మండలం మంతపురికి చెందిన పల్లె ఇంద్రకుమార్‌గౌడ్ గోల్డ్ మెడల్ సాధించారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఇంద్రకుమార్‌గౌడ్ గోల్డ్ మెడల్‌తోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇంద్రకుమార్ మంతపురి మాజీ సర్పంచ్ పల్లె లక్ష్మీ–శ్రీనివా స్‌గౌడ్ దంపతుల కుమారుడు. ఈయన ప్రస్తుతం జనగాం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇంద్రకుమార్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మిత్రులు అభినందనలు తెలిపారు.