
మహిళలకు 199 సర్పంచ్ స్థానాలు
ఎంపీటీసీ రిజర్వేషన్లు..
సర్పంచ్‌ల రిజర్వేషన్లు
కేటగిరీల వారీగా..
సాక్షి, యాదాద్రి : ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారులు ఇటీవల డ్రా తీసిన విషయం తెలిసిందే. 178 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 12, ఎస్సీలకు 32, బీసీలకు 76, జనరల్ కేటగిరీకి 58 స్థానాలు కేటాయించారు. ఇందులో మహిళలకు 77 స్థానాలు వచ్చాయి. అలాగే 427 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 49, ఎస్సీలకు 74, బీసీలకు 164, జనరల్‌కు 140 స్థానాలను కేటాయించారు. ఇందులో మహిళలకు 199 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఆయా రిజర్వేషన్ల ప్రకారం ఆశావహులు పోటీకి సిద్ధం అవుతున్నారు. ఎస్టీ రిజర్వేషన్లు గిరిజనులు ఎక్కువగా ఉన్న మండలాల్లోనే వచ్చాయి. వీటిలో సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్ మండలాల్లో ఎస్టీలకు అత్యధికంగా ఉండగా, ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రాజాపేట మండలాల్లో అతి తక్కువగా ఉన్నాయి.
కేటగిరీ మహిళా జనరల్
ఎస్టీ 4 8
ఎస్సీ 13 19
బీసీ 34 42
జనరల్ 26 32
మొత్తం 77 101
ఫ ఎంపీటీసీ స్థానాల్లోనూ 77 వారికే..
ఫ అన్ని కేటగిరీల్లో లెక్కలు
తేల్చిన అధికారులు
ఫ గిరిజనులు ఎక్కువగా ఉన్నచోట వారికే రిజర్వు
కేటగిరీ మహిళా జనరల్
ఎస్టీ 21 28
ఎస్సీ 33 41
బీసీ 79 85
జనరల్ 66 74
మొత్తం 199 228