
ముమ్మరంగా పంటల నమోదు
ఆత్మకూరు(ఎం): పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు దళారుల బారిన పడకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి వ్యవసాయ శాఖ ఆన్‌లైన్ యాప్‌లో పంటల నమోదు ప్రక్రియను కొనసాగిస్తోంది. అన్ని మండలాల్లో ఏఈలు ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లలో కూడా దళారులు చొరబడి రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను మళ్లీ ప్రభుత్వానికి అమ్ముకుని మద్దతు ధరను పొందుతున్నారు. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర పొందలేక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పంటల నమోదు కార్యక్రమాన్ని చేపడుతూ రైతులు సాగుచేసిన పంటల దిగుబడని అంచనా వేస్తోంది. తద్వారా మార్కెట్లలో సదుపాయాలు కల్పించి రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపట్టింది. పంట నమోదు చేసుకున్న రైతులు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌కు, సీసీఐ కేంద్రాలకుకి వెళ్లి తమ పంట ఉత్పత్తులను అమ్ముకుంటూ మద్దతు ధరను పొందగలుగుతున్నారు.
4.03 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో వరి, పత్తి, కందితోపాటు వివిధ రకాల పంటలు కలిపి మొత్తం 4,03,414 ఎకరాల్లో సాగవుతున్నాయి. అందులో 2,82,897 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 1,13,193 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఆగస్టు 20 నుంచి పంట నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా ఇప్పటి వరకు 87వేల ఎకరాల్లో పంటల వివరాలు నమోదు చేశారు. అందులోభాగంగా ఆత్మకూ(ఎం) మండలంలో అత్యధికంగా 3వేల ఎకరాలలోపు పంటల వివరాలు నమోదు చేయించగలిగారు. అయితే పంట నమోదుపై చాలామంది రైతులకు అవగాహన లేకపోవడంతో నమోదుకు దూరం అవుతున్నారు. పంట నమోదుపై రైతులకు అవగాహన కల్పిస్తే మరింత మందిమి నమోదు చేసుకుంటారని రైతులు అంటున్నారు.
ఫ మద్దతు ధర అందించేందుకే నమోదు
ఫ నాలుగేళ్లుగా చేపడుతున్న ప్రభుత్వం
ఫ ఈ ఏడాదికి సంబంధించి ఆగస్టు
నుంచి కొనసాగింపు
ఫ ఇప్పటి వరకు 87 వేల ఎకరాల మేర
ఆన్‌లైన్ యాప్‌లో నమోదు
ఫ మరింత అవగాహన
కల్పించాలంటున్న రైతులు