
కలెక్టర్ తనిఖీకొస్తే తాళం వేసి ఉన్న పల్లె దవాఖానా
ఫ ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీసులు
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని చొల్లేరు గ్రామంలో గల ఆరోగ్య ఉపకేంద్రం (పల్లె దవాఖానా)లో పనిచేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)కి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం గ్రామంలోని ఆరోగ్య ఉప కేందాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో పల్లె దవాఖానా తాళం వేసి ఉంది, సిబ్బంది కూడా ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ వెంటనే ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఫోన్ ద్వారా జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్
భువనగిరి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి హెల్ప్ డెస్క్‌ను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం హెల్స్ డెస్క్ ఉపయోగపడుతుందన్నారు. హెల్స్ డెస్క్‌కు ప్రత్యేంగా డివిజన్ పంచాయతీ అధికారి ప్రతాప్‌నాయక్‌తో పాటు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. హెల్స్ డెస్క్ నంబర్ 8978928637ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ తనిఖీకొస్తే తాళం వేసి ఉన్న పల్లె దవాఖానా